<b>సెప్టెంబర్ 2020 </>

సెప్టెంబర్ 2020

సెప్టెంబర్ 2020 అంతర్జాతీయం

సగటు జీతాల గ్లోబల్ లిస్ట్‌లో భారత్‌కు 72 ర్యాంకు

ప్రపంచవ్యాప్తంగా సగటు నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్స్ లో భారత్ 72వ స్థానంలో నిలిచింది. తాజాగా 106 దేశాల్లో సగటు నెలవారీ జీతాలు, వేతనాలు ఎలా ఉన్నాయన్న దానిపై అంతర్జాతీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం పికొడి.కామ్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. స్విట్జర్లాండ్ రూ.4.49 లక్షల (5,989 యూఎస్ డాలర్లు) సగటు జీతంతో ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.
సగటు నెలవారీ జీతాల గ్లోబల్ ర్యాంకింగ్స్

ర్యాంకు

దేశం

అంకెలు (అమెరికా డాలర్లలో..)

1

స్విట్జర్లాండ్

5,989

2

లగ్జెంబర్గ్

4,014

3

అమెరికా

3,534

4

డెన్మార్క్

3,515

5

సింగపూర్

3,414

6

ఆస్ట్రేలియా

3,333

7

ఖతార్

3,232

8

నార్వే

3,174

9

హాంకాంగ్

3,024

10

ఐస్‌లాండ్

2,644

72

భారత్

437

106

క్యూబా

36

ఆసియాలో దక్షిణ కొరియా...
ఆసియాలోని దేశాల్లో దక్షిణ కొరియా రూ.1,72,900 సగటు నెలసరి ఆదాయంతో ఉన్నత స్థానంలో ఉండగా, చైనా రూ.72,100, మలేసియా రూ.62,700, థాయ్‌లాండ్ రూ.46,400 ఆ తర్వాత ర్యాంకుల్లో నిలిచాయి. ఇక వియత్నాం రూ.30,200, ఫిలిప్పీన్స్ రూ.23,100, ఇండోనేసియా రూ.22,900, పాకిస్తాన్ రూ.15,700 నెలసరి సగటు జీతాలు, వేతనాలతో అథమస్థానాల్లో నిలిచాయి.
అమెరికాలో అత్యధిక ఆదాయం పొందుతున్న విదేశీయులు?
వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉంది. ఏటా అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తున్న అమెరికన్ కమ్యూనిటీ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. స్థానికులు, విదేశీయుల మధ్యస్థ కుటుంబాల ఆదాయ వివరాలు అమెరికన్ కమ్యూనిటీ సర్వేలో నమోదు చేస్తారు. అందులో వివిధ దేశాల నుంచి వచ్చినవారి గణాంకాలూ పొందురుస్తారు.
సర్వే వివరాల ప్రకారం...
అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్ అమెరికన్ల సగటు ఆదాయం ఏటా అందరికంటే ఎక్కువగా 1,00,500 డాలర్లుగా నమోదైంది. భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక.. నాలుగు, చైనా.. ఏడు, పాకిస్తాన్ .. ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మొత్తం మీద టాప్ 10 దేశాల్లో తొమ్మిది ఆసియా దేశాలే కాగా.. స్థానికులు ఏకంగా 9వ స్థానంలో నిలిచారు.
అమెరికాలో స్థిరపడిన వివిధ దేశాల మధ్యస్థ(మధ్య తరగతి) కుటుంబాల సగటు ఆదాయం ఏటా..

స్థానం దేశం

దేశం

ఆదాయం(డాలర్లలో...)

1

ఇండియన్

1,00,500

2

ఫిలిప్పో

83,300

3

తైవానీస్

82,500

4

శ్రీలంకన్

74,600

5

జపనీస్

72,300

6

మలేసియన్

70,300

7

చైనీస్

69,100

8

పాకిస్తాన్

66,200

9

వైట్-అమెరికన్లు

59,900

10

కొరియన్

59,200

11

ఇండోనేసియన్

57,500

12

స్థానిక-అమెరికన్లు

56,200

13

థాయ్‌లాండ్

55,000

14

బంగ్లాదేశీ

50,000

15

నేపాలీ

43,500

16

లాటినో

43,000

17

ఆఫ్రికన్ -అమెరికన్లు

35,000

బ్యాచిలర్ డిగ్రీలోనూ...
అమెరికాలో స్థిరపడుతున్న విదేశీయుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారిలోనూ భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు.
ఈ విషయంలో అమెరికన్లు 28 శాతంతో ఆఖరిస్థానంలో నిలవడం గమనార్హం.

దేశం

శాతం

ఇండియన్ - అమెరికన్లు

70

కొరియన్ - అమెరికన్లు

53

చైనీస్ - అమెరికన్లు

51

ఫిలిప్పో - అమెరికన్లు

47

జపనీస్ - అమెరికన్లు

46

సగటు అమెరికన్లు

28


గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో భారత్ ర్యాంకు?
2020 సంవత్సరానికిగాను ప్రపంచ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూఐపీవో), కార్నెల్ యూనివర్సిటీ, ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా రూపొందించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)-2020లో భారత్‌కు 48వ ర్యాంకు లభించింది. విద్యా సంస్థలు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ తదితర అంశాలపై 131 దేశాల్లో అధ్యయనం చేసి జీఐఐ-2020ను రూపొందించారు. జీఐఐ-2019లో భారత్ 52 ర్యాంకును పొందగా... తాజాగా నాలుగు స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిలిచింది.
జీఐఐ-2020లోని ముఖ్యాంశాలు

 • జాబితాలోని తొలి ఐదు స్థానాల్లో స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్‌‌స నిలిచాయి.
 • నవకల్పనలకు సంబంధించి టాప్ 50 దేశాల జాబితాలో భారత్ తొలిసారి స్థానం దక్కించుకుంది.
 • నవకల్పనల్లో టాప్ దేశాలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ క్రమంగా చైనా, భారత్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి ఆసియా దేశాల స్థానాలు మెరుగుపడుతున్నాయి.
 • వివిధ అంశాల ప్రాతిపదికన చూస్తే నవకల్పనలకు సంబంధించి దిగువ మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
 • ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సర్వీసుల ఎగుమతులు, ప్రభుత్వ ఆన్‌లైన్ సర్వీసులు వంటి విభాగాల్లో టాప్ 15 దేశాల్లో చోటు దక్కించుకుంది.

సెప్టెంబర్ 2020 జాతీయం

స్టార్టప్ చాలెంజ్ చునౌతి కార్యక్రమం ప్రారంభం
వినూత్నమైన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్టప్ సంస్థలకు నిధుల సాయం అందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ ‘చునౌతి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రత్యేకంగా ద్వితీయ శ్రేణి పట్టణాల(టైర్-2)పై దృష్టి సారించే స్టార్టప్‌లు, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ప్రోత్సహించే చునౌతి తదుపరి దశ స్టార్టప్ చాలెంజ్ పోటీని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగస్టు 28న ప్రారంభించారు.
300 వరకు స్టార్టప్‌ల ఎంపిక...
చునౌతి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన విభాగాల్లో పనిచేసే 300 వరకు స్టార్టప్‌లను ఎంపిక చేసి, ఒక్కోదానికి రూ.25 లక్షల వరకు నిధుల సాయంతోపాటు, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. చునౌతి కార్యక్రమం కోసం ప్రభుత్వం మూడేళ్లలో రూ.95 కోట్లు ఖర్చు చేయనుంది.

ఎడోబ్ ఇండియాతో నాస్కామ్ జట్టు
యూజర్ ఎక్స్‌పీరియన్స్ (యూఎక్స్) డిజైన్‌లో విద్యార్థులు, నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు ఎడోబ్ ఇండియాతో ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ జట్టు కట్టింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 28న యూఎక్స్ ఫౌండేషన్ ప్రోగ్రాంను ఎడోబ్ ఇండియా, నాస్కామ్ ఆవిష్కరించాయి. నాస్కామ్‌కు చెందిన ఫ్యూచర్‌స్కిల్స్ ప్లాట్‌ఫాంపై నమోదు చేసుకున్న మొత్తం మూడు లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌కు ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది. శిక్షణ విషయంలో పరిశ్రమ భాగస్వామిగా కాగ్ని జెంట్ వ్యవహరిస్తుందని నాస్కామ్ ఫ్యూచర్‌స్కిల్స్ కో-ఆర్కిటెక్ట్ అమిత్ అగర్వాల్ తెలిపారు.

పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం
పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీతో పాటు బైడు, క్యామ్‌కార్డ్, విచాట్ రీడింగ్, టెన్సెంట్ వీన్, సైబర్ హంటర్, లైఫ్ ఆఫ్టర్ వంటి పలు యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2న వెల్లడించింది. ఈ యాప్‌ల వల్ల దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందు వల్లే తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్, యాపిల్ ప్లేసోర్ట నుంచి ఈ 118 యాప్‌లను తొలగించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 69 (ఎ), ప్రజల సమాచారం సంగ్రహించడాన్ని నిరోధించే విధానం, భద్రతల నిబంధనలు- 2009 పరిధిలో ఈ 118 యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. పబ్‌జీ గేమ్ పిల్లలు, యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందనే అభిప్రాయం ఉంది. భారత్‌లో పబ్‌జీ క్రియాశీల వినియోగదారులు 3.3 కోట్ల మంది ఉన్నారు. ప్రతిరోజూ మనదేశంలో 1.3 కోట్ల మంది దీన్ని ఆడుతున్నారు.
118 నిషేధిత యాప్‌ల జాబితా...

Edu news

Edu news

 

Edu news


ఝాన్సీ వ్యవసాయ వర్సిటీ భవనాలు ప్రారంభం
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భవనాలను ఆగస్టు 29న ఆన్‌లైన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ... పాఠశాల స్థాయిలోనే వ్యవసాయాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం 2020లో సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ మైక్రో నీడిల్ తయారు
ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన నిపుణులు అత్యంత సన్నని మైక్రో నీడిల్‌ను తయారు చేశారు. ఈ సూదితో ఇంజెక్షన్ చేస్తే నొప్పే తెలియదని తయారీదారులు పేర్కొన్నారు. అత్యంత సన్నగా ఉన్నప్పటికీ శరీరానికి గుచ్చే సమయంలో విరిగి పోకుండా ఉండేలా బలమైన గాజు కార్బన్‌తో రూపొందించారు.

ఇంగ్లీష్ ప్రొ మొబైల్ యాప్ ఆవిష్కరణ
ఇంగ్లిష్ భాషను సులభతరంగా నేర్చుకునేందుకు రూపొందించిన ‘ఇంగ్లీష్ ప్రొ’ యాప్‌ను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఆగస్ట్ 31న ఢిల్లీలో ప్రారంభించారు. యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (యూఎస్‌ఆర్)లో భాగంగా ఇంగ్లిష్ అండ్ ఫారేన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు, ఆసక్తి గల అన్ని వర్గాల ప్రజలు ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ తెలిపారు.

మిషన్ కర్మయోగి పథకానికి కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగులను మరింత సమర్థ్ధవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ‘మిషన్ కర్మయోగి’ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 2న సమావేశమైన కేబినెట్ మిషన్ కర్మయోగి లేదా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్(ఎన్‌పీసీఎస్‌సీబీ) కార్యక్రమానికి పచ్చ జెండా ఊపింది. భవిష్యత్ భారత అవసరాలను తీర్చగల సమర్ధులైన ఉద్యోగులను రూపొందించడం మిషన్ కర్మయోగి లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మిషన్ కర్మయోగి-ముఖ్యాంశాలు

 • ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, సానుకూల దృక్పథం కలిగినవారుగా, వృత్తి నిపుణులుగా, సాంకేతికంగా మరింత మెరుగైన వారిగా మార్చే అతిపెద్ద పాలనా సంస్కరణగా ‘మిషన్ కర్మయోగి’ని కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది.
 • 2020 నుంచి 2025 వరకు దశలవారీగా రూ. 510.86 కోట్ల వ్యయంతో సుమారు 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
 • ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
 • పథకానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలో కొందరు ఎంపిక చేసిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రఖ్యాత హెచ్‌ఆర్ నిపుణులు సభ్యులుగా ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేస్తారు.

జమ్మూకశ్మీర్ లాంగ్వేజెస్ బిల్లు ఉద్దేశం ఏమిటీ?
జమ్మూ, కశ్మీర్‌లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు ఉద్దేశించిన ‘జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్-2020’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 2న సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ఇప్పటికే ఇంగ్లీష్, ఉర్దూ అధికార భాషలుగా ఉన్నాయి.
స్కూల్‌నెట్ విక్రయానికి అనుమతి...
రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని విద్యా రంగ సంస్థ విక్రయానికి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతినిచ్చింది. స్కూల్‌నెట్ ఇండియా (గతంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్)లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కున్న 73.69 శాతం వాటాలను ఫలాఫల్ టెక్నాలజీకి విక్రయించేందుకు ఆమోదం తెలిపింది. ఫలాఫల్ మాతృసంస్థ లెక్సింగ్టన్ ఈక్విటీ హోల్డింగ్‌‌స (ఎల్‌ఈహెచ్‌ఎల్)కు ఇప్పటికే స్కూల్‌నెట్‌లో 26.13 శాతం వాటా ఉంది.

సెప్టెంబర్ 2020 రాష్ట్రీయం

వైఎస్సార్ వేదాద్రి పథకానికి శంకుస్థాపన
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో కృష్ణా నదిపై రూ.490 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ‘వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకా’నికి శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టుకు ఆగస్టు 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ... 2021 ఏడాది ఫిబ్రవరి నాటికి వేదాద్రి పథకాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
సీఎం ప్రసంగం-ముఖ్యాంశాలు

 • కృష్ణా జిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగు, సాగు నీటి కోసం ఈ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తోంది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదు. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం.
 • ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తాం. డీవీఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితోపాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా వైఎస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా నీరు అందిస్తాం.
 • దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.


యునెస్కో ద్వారా పీవీ నరసింహారావు అవార్డు
దివంగత మాజీ ప్రధానమంత్రి, పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలంటూ 2020, సెప్టంబర్ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ ఆగస్టు 28న ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ కె.కేశవరావు, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.
సీఎం ప్రకటన-కీలక నిర్ణయాలు

 • విద్యా, వైజ్ఞానిక సాహితీ రంగాల్లో సేవ చేసిన వారికి పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డుకు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదన, అవార్డుకు సంబంధించిన నగదు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం.
 • హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నెక్లెస్ రోడ్డును ఉద్యానవనాలతో పీవీ జ్ఞానమార్గ్‌గా అభివృద్ధి చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఆయన మెమోరియల్‌ను నిర్మిస్తాం.
 • అసెంబ్లీలో పీవీ తైలవర్ణ చిత్రాన్ని ఏర్పాటు చేస్తాం. పార్లమెంటులో పీవీ చిత్రపటం ఏర్పాటుతోపాటు, హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం.
 • పీవీ జన్మించిన లక్నేపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక
 • హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్.
 • అమెరికా, సింగపూర్, దక్షిణాఫ్రికా, మలేషియా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనెడా తదితర దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాల నిర్వహణకు షెడ్యూలు.
 • శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం.
 • ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పనిచేసిన కాలంలో పీవీకి సన్నిహిత సంబంధాల ఉన్న అమెరికా మాజీ అద్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ ప్రధాని జాన్ మేజర్ తదితరులను శత జయంతి ఉత్సవాలకు ఆహ్వానించాలని నిర్ణయం.
 • పీవీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున ముద్రణ, వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, ప్రసంగాలు, ఇంటర్వ్యూలతో పుస్తకాలు, జీవిత విశేషాలతో కూడిన కాఫీ టేబుల్ తయారు.

తెలంగాణకు మెక్రోసాఫ్ట్ సంస్థ సాయం
కోవిడ్-19 మహమ్మారిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరుకు మద్దతు పలుకుతూ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా రూ.3.8 కోట్ల విలువ చేసే వైద్య పరికరాలను అందజేసింది. ఆగస్టు 28న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసిన సంస్థ ప్రతి నిధులు వైద్య పరికరాలను అందజేశారు. తాము అందజేసిన 14 అత్యాధునిక కోవిడ్ 19 పరీక్ష యంత్రాల ద్వారా రోజుకు 3,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ ఎండీ రాజీవ్ కుమార్ తెలిపారు.
26 అడుగుల వరకు...
కరోనా వైరస్ బారిన పడకుండా ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోదని ఆక్స్‌ఫర్డ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్-19 రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, పాడినప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వెలువడే కంటికి కనబడని తుంపర్లు కొద్ది సెకండ్లలోనే 26 అడుగుల వరకు ప్రయాణిస్తాయని బీఎంజే జర్నల్‌లో ప్రచురితమైన ఆ సర్వే వెల్లడించింది.

పోషణ మాసంగా 2020 సెప్టెంబర్
2020, సెప్టెంబర్‌ను పోషణ మాసంగా పరిగణిస్తూ మహిళలు, పిల్లల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాలని తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. జిల్లా సంక్షేమాధికారులతో ఆగస్టు 29న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడుతూ... సెప్టెంబర్‌ను పోషణ మాసంగా ప్రభుత్వం నిర్దేశించిందని.. ఈ నెలంతా అంగన్‌వాడీల్లో నమోదైన బాలింతలు, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
భారత్ కేంద్రంగా కంప్యూటర్ గేమ్స్
అన్ని రంగాల్లోనూ స్వావలంబ భారత్ దిశగా కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆటబొమ్మల మార్కెట్ సుమారు రూ. 7 లక్షల కోట్లు కాగా.. అందులో భారత్ వాటా చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు. భారత్‌లోని స్టార్టప్స్, యువ పారిశ్రామికవేత్తలు ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ ఆట బొమ్మల కేంద్రంగా భారత్ రూపుదిద్దుకోగలదని, స్థానిక ఆట బొమ్మలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ఆగస్టు 30 ‘మన్ కీ బాత్’లో మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆటబొమ్మల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది.

పచ్చదనం పెంపుకు గ్రీన్ స్పేస్ ఇండెక్స్
మున్సిపాలిటీల్లో పచ్చదనం పెంచేందుకు ‘గ్రీన్ స్పేస్ ఇండెక్స్’పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆగస్టు 30న వెల్లడించారు. కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...

 • నాలుగేళ్ల పాటు అన్ని మున్సిపాలిటీల్లో గ్రీన్ స్పేస్ ఇండెక్స్ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
 • పచ్చదనాన్ని పెంచే అత్యుత్తమ పురపాలికలకు ఏటా అవార్డులు ఇస్తారు. తద్వారా పోటీతత్వం పెంపుకు వీలవుతుంది.
 • గ్రీన్ స్పేస్ ఇండెక్స్‌లో భాగంగా వినూత్న డిజైన్లు, రోడ్ల పక్కన పచ్చదనం, ఇంటి మొక్కల పెంపకం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.
 • మున్సిపాలిటీల్లో ప్రస్తుతమున్న గ్రీన్ కవర్‌ను మదించేందుకు జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్), ఉపగ్రహ చిత్రాలు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, జియో ట్యాగింగ్ పద్ధతుల ద్వారా రికార్డు చేస్తారు.
 • మున్సిపాలిటీల వారీగా ఆయా పట్టణాల్లో గ్రీన్ కవరేజీకి 85 శాతం, గ్రీన్ కవర్ పెంచడంలో అవలంబించిన ఇన్నోవేటివ్ పద్ధతులకు 5 శాతం, ఆకట్టుకునే డిజైన్లతో చేపట్టే ప్లాంటేషన్ కు మరో 10 శాతం వెయిటేజీ ఇచ్చి ఉత్తమ పురపాలికలను ఎంపిక చేస్తారు.
 • అత్యధిక అర్బన్ గ్రీన్ స్పేస్, బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అర్బన్ గ్రీన్ స్పేస్, అర్బన్ గ్రీన్ స్పేస్ పర్ క్యాపిటల్, రోడ్ల పక్కన మొక్కల పెంపకం వంటి కేటగిరీల్లో అవార్డులు ఇస్తారు.

సెప్టెంబర్ 2020 ఎకానమీ

ఎన్‌ఎండీసీ ఐరన్, స్టీల్ ప్లాంట్ డీమెర్జ్
మైనింగ్ రంగ దిగ్గజం నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ).. ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్ వద్ద నిర్మిస్తున్న ఎన్‌ఎండీసీ ఐరన్, స్టీల్ ప్లాంట్‌ను కంపెనీ నుంచి విడగొట్టనున్నట్టు (డీమెర్జ్) ఆగస్టు 28న ప్రకటించింది. డీమెర్జ్ ప్రక్రియ పూర్తి కావడానికి తొమ్మిది నెలల వరకు సమయం పట్టవచ్చని ఎన్‌ఎండీసీ వివరించింది. ఏటా 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్లాంటుకు ఎన్‌ఎండీసీ ఇప్పటి వరకు రూ.17,000 కోట్లు ఖర్చు చేసింది. 2021లో ఈ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం కానుంది.
విప్రో హైజెనిక్స్ విడుదల...
ఎఫ్‌ఎంజీసీ రంగంలోని విప్రో కన్జూమర్ కేర్ ‘‘హైజెనిక్స్’’ బ్రాండ్ పేరుతో సూక్ష్మజీవుల సంహారక ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఉత్పత్తిలో భాగమైన శానిటైజర్, హ్యాండ్ వాష్, సబ్బు బలమైన ఫార్ములేషన్‌తో పాటు 99.9శాతం క్రిముల నుంచి రక్షణనిస్తుందని నిరూపితమైందని కంపెనీ పేర్కొంది.

రిలయన్స్ రిటైల్ చేతికి ఫ్యూచర్ రిటైల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్).... కిషోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలను కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌వీఎల్ ఆగస్టు 29న వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లు అని పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన 1,800లకుపైగా బిగ్‌బజార్, ఎఫ్‌బీబీ, ఈజీడే, సెంట్రల్, ఫుడ్‌హాల్ స్టోర్లు దేశవ్యాప్తంగా 420లకు పైచిలుకు నగరాల్లో విస్తరించాయి.
డీల్‌లో భాగంగా ఫ్యూచర్ గ్రూప్ రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌కు బదిలీ అవుతాయి. అలాగే లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు బదిలీ చేస్తారు.

40 ఏళ్ల తర్వాత మైనస్‌లోకి భారత జీడీపీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పాతాళానికి జారిపోయింది. గత ఏడాది కాలంతో పోలిస్తే, అసలు వృద్ధిలేకపోగా మైనస్ 23.9 శాతం క్షీణించింది. కరోనా నేపథ్యంలో దేశంలో అమలుచేసిన కఠిన లాక్‌డౌన్ దీనికి ప్రధాన కారణం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్‌ఎస్‌ఓ), గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఆగస్టు 31న విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఇదే తొలిసారి...

 • 2020-21 జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతం అయితే 2019 ఇదే త్రైమాసికంలో 5.2 శాతంగా ఉంది.
 • గడిచిన 40 ఏళ్లలో దేశ జీడీపీ మళ్లీ మైనస్‌లోకి జారిపోవడం ఇదే తొలిసారి. చరిత్రలో ఇంతటి ఘోర క్షీణత నమోదవడం కూడా మొట్టమొదటిసారి.
 • త్రైమాసిక గణాంకాలు ప్రారంభమైన 1996 నుంచీ ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణ పతనం ఇదే తొలిసారి.
 • తాజా త్రైమాసికంలో వ్యవసాయ రంగం మాత్రమే(3.4 శాతం) వృద్ధి రేటును నమోదుచేసుకుంది.

విలువల్లో చూస్తే...

 • ఎస్‌ఎస్‌ఓ గణాంకాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.35.35 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.26.90 లక్షల కోట్లు. వెరసి మైనస్ -23.9 శాతం క్షీణ రేటు నమోదయి్యంది.
 • కేవలం వస్తు ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) ప్రకారం జీడీపీ విలువ రూ.33.08 లక్షల కోట్ల నుంచి రూ.25.53 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇక్కడ విలువ మైనస్ 22.8 శాతం క్షీణించింది.


ద్రవ్యలోటు ఎంత శాతం దాటకూడదన్నది ప్రభుత్వ లక్ష్యం?
ప్రభుత్వ ఆదాయం-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి నాలుగు నెలల్లోనే కట్టుతప్పింది.
కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) తాజాగా విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే...

 • 2020 (ఏప్రిల్)-2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో మొత్తం ద్రవ్యలోటు రూ.7.96 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉండాలన్నది 2020, ఫిబ్రవరిలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లక్ష్యం.
 • ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలో 3.5 శాతం దాటకూడదన్నది ఈ లక్ష్యం ఉద్దేశం.
 • - అయితే ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలూ గడిచే సరికే- అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్య నాటికే ద్రవ్యలోటు రూ.8,21,349కోట్లకు చేరింది. అంటే వార్షిక లక్ష్యంలో 103.1 శాతానికి చేరిందన్నమాట.
 • ప్రభుత్వ మొత్తం బడ్జెట్ ఆదాయ అంచనాల్లో జూలై నాటికి 10.4 శాతం మాత్రమే (రూ.2,32,860 కోట్లు) ఒనగూరింది. ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయ లక్ష్యం రూ.22.45 లక్షల కోట్లు. ఇక వ్యయాలు దాదాపు యథాతథంగా అంచనాల్లో 34 శాతానికి (రూ.10,54,209 కోట్లు) చేరాయి.
జీడీపీ అంచనాలపై ఎస్‌బీఐ రూపొందించిన నివేదిక పేరు?
2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అనే అంశంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ‘ఎకోర్యాప్’ పేరుతో ఒక పరిశోధనా నివేదికను సెప్టెంబర్ 1న విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది భారత జీడీపీ మెనస్ 10.9 శాతం వరకు క్షీణిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. భారత జీడీపీ మైనస్ 6.8 శాతంగా ఉండొచ్చని ఎస్‌బీఐ గతంలో అంచానా వేసింది. తాజాగా మైనస్ 10.9 శాతానికి పెంచింది.
ఆరు జట్లకు స్పాన్సర్‌గా బీకేటీ టైర్స్
ఐపీఎల్ 13వ సీజన్లో పాల్గొంటున్న ఆరు జట్లకు స్పాన్సర్ చేయనున్నట్టు టైర్ల తయారీ సంస్థ బీకేటీ టైర్స్ వెల్లడించింది. వీటిలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్‌‌స, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్‌‌స ఎలెవన్ పంజాబ్, కోల్‌కత నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి.
 
సెప్టెంబర్ 2020 ద్వైపాక్షిక సంబంధాలు
 
ఏ ప్రాంతంలోని సరిహద్దుల్లో సైన్యం సొరంగ మార్గాన్ని గుర్తించింది?

జమ్మూలోని సాంబా సెక్టార్‌లో గాలార్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ వైపు వెళుతున్న 170 మీటర్ల పొడవైన ఒక సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్‌ఎఫ్) కనుగొన్నాయి. 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3-4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉందని ఆగస్టు 29న సైన్యాధికారులు వెల్లడించారు. భారత్‌లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్‌‌స, ఆయుధాలు రవాణా చేయడం కోసమే పాకిస్తాన్ దీనిని నిర్మించిందని పేర్కొన్నారు. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది. ప్రస్తుతం బీఎస్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా ఉన్నారు.
చుషుల్‌లో చర్చలు...
సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో తాజాగా నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా మరో దఫా సైనిక చర్చలు చేపట్టాయి. సరిహద్దులో భారత్ వైపున్న చుషుల్‌లో సెప్టెంబర్ 1న బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారుల చర్చలు ప్రారంభమయ్యాయి. పాంగాంగ్ సరస్సు వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలన్న నిర్ణయానికి తూట్లు పొడుస్తూ ఆగస్టు 31న చైనా మిలిటరీ దుస్సాహసానికి దిగింది. పెద్ద సంఖ్యలో చైనా బలగాలు భారత్ వైపునకు చొచ్చుకొని వచ్చి దురాక్రమణకు యత్నించాయి.
అందుకే వివాదాలు: చైనా మంత్రి
భారత్, చైనా సరిహద్దులో ఒకవైపు ఉద్రిక్తతలు నెలకొనగా మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా సరిహద్దుల్ని ఇంకా నిర్ణయించలేదని, అందుకే ఎప్పుడూ సమస్యలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు.
 
సెప్టెంబర్ 2020 సైన్స్ & టెక్నాలజీ
 
విత్తనం ఎంత కాలం బతుకుతుంది?
విత్తనం ఎంత కాలం బతుకుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) ప్రయత్నిస్తోంది. ఇందుకోసం మరో ఆరు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ‘‘స్వాల్‌బోర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్’’లో పదమూడు రకాల విత్తనాలను వందేళ్ల ప్రయోగాల కోసం నిల్వ చేయనుంది.
ఇక్రిశాట్ ప్రయోగం-ముఖ్యాంశాలు
 • భవిష్యత్తులో ప్రపంచం మొత్తమ్మీద ఏదైనా పంటను మళ్లీ పునరుద్ధరించేందుకు ఏం చేయాలన్నది ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుందని అంచనా.
 • ఇక్రిశాట్‌తోపాటు ఇతర సంస్థల్లోని విత్తన జన్యుబ్యాంకులు ఈ ప్రయోగంలో పాల్గొంటున్నాయి.
 • మొత్తం 13 రకాల విత్తనాలను స్వాల్‌బోర్డ్‌లోని విత్తన బ్యాంకులో నిల్వ చేయనుండగా ఇందులో నాలుగింటిని ఇక్రిశాట్ సమకూర్చనుంది.
 • వేరుశనగ, జొన్న, కంది, శనగ పంటలను ఇక్రిశాట్ అందజేయనుంది.
 • ప్రయోగం 2022-23లో మొదలవుతుంది.
 • విత్తన బ్యాంకులో విత్తనాలను -18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తారు. పదేళ్లకు ఒకసారి విత్తనాలను వెలికితీసి పరిశీలించి మళ్లీ నిల్వ చేస్తారు.
 
సెప్టెంబర్ 2020 అవార్డ్స్
 
జాతీయ క్రీడా పురస్కారాల-2020
2020 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆగస్టు 21న ప్రకటించింది. జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29(ద్యాన్‌చంద్ 115వ జయంతి)న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. సాధారణంగా ప్రతి సంవత్సరం దిగ్గజ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29న అవార్డులను అందజేస్తారు.
వర్చువల్‌గా అవార్డుల స్వీకరణ...
కరోనా వైరస్ విజృంభణ కారణంగా 2020 ఏడాది క్రీడా పురస్కారాలను రాష్ట్రపతి కోవింద్ వర్చువల్ (ఆన్‌లైన్) పద్ధతిలో ప్రదానం చేశారు. దీనికి దేశంలోని 11 భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రాలు వేదికలుగా నిలిచాయి. రాష్ట్రపతి భవన్‌తో అనుసంధానమైన సాయ్ కేంద్రాలు అత్యంత సురక్షిత వాతావరణంలో వేడుకల్ని నిర్వహించాయి. మొత్తం 74 (5 ఖేల్త్న్ర, 27 అర్జున, 13 ద్రోణాచార్య, 15 ధ్యాన్‌చంద్ ) మంది 2020 ఏడాది జాతీయ అవార్డులను గెలుచుకోగా ఆగస్టు 29న 60 మంది ఈ పురస్కారాలను స్వీకరించారు.
బెంగళూరు నుంచి మనికా...
ఖేల్ రత్న కు ఎంపికై న మహిళా హాకీ ప్లేయర్ రాణి రాంపాల్, పారాలింపియన్ తంగవేలు సాయ్ పుణే కేంద్రం నుంచి... టీటీ ప్లేయర్ మనికా బాత్రా బెంగళూరు నుంచి ఈ అవార్డులను అందుకున్నారు. దుబాయ్‌లో ఉండటంతో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, కరోనా సోకడంతో వినేశ్ ఫొగాట్, ఏపీ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ తమ అవార్డులను అందుకోలేదు. 44 ఏళ్ల క్రీడా అవార్డుల చరిత్రలో కరోనా కారణంగా తొలిసారి ఆన్‌లైన్ ద్వారా అవార్డుల వేడుకలు నిర్వహించారు. ప్రతి యేటా ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో అవార్డుల అందజేత కార్యక్రమం నిర్వహించేవారు.
ఏపీ నుంచి ఇద్దరికి...
2020 ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి జాతీయ క్రీడా పురస్కారాలు లభించాయి. యువ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్‌కు ‘అర్జున’, మాజీ బాక్సర్ నగిశెట్టి ఉషకు ‘ద్యాన్‌చంద్’ జీవితకాల సాఫల్య పురస్కారం లభించాయి.
పెరిగిన ప్రైజ్‌మనీ..
జాతీయ క్రీడా అవార్డుల ప్రైజ్‌మనీ భారీగా పెంచినట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. 2020 ఏడాది నుంచే దీనిని అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. నూతన విధానం ప్రకారం ఖేల్త్న్ర పురస్కారానికి రూ. 25 లక్షల ప్రైజ్‌మనీగా చెల్లించనున్నారు. గతంలో ఇది రూ. 7.5 లక్షలుగా ఉంది.
అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డుల ప్రైజ్‌మనీలో కూడా మార్పులు చేశారు. గతేడాది వరకు ఈ అవార్డులకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లిస్తుండగా... 2020 ఏడాది నుంచి అర్జున, ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం గ్రహీతలకు రూ. 15 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ద్రోణాచార్య (రెగ్యులర్), ధ్యాన్‌చంద్ అవార్డు విజేతలు రూ. 10 లక్షల చొప్పున అందుకోనున్నారు. చివరిసారిగా 2008లో ప్రైజ్‌మనీలో మార్పులు జరిగాయి.
రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న (5):
2020 ఏడాదికిగాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’ ను ఒకేసారి అత్యధికంగా ఐదుగురు ఎంపికయ్యారు. గతంలో 2016లో ఒకేసారి అత్యధికంగా నలుగురికి ‘ఖేల్త్న్ర’ అవార్డును ఇచ్చారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన స్మారకార్థం 1991లో ‘ఖేల్త్న్ర’ అవార్డును ప్రవేశపెట్టారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

రోహిత్ శర్మ

క్రికెట్

2

వినేశ్ ఫొగాట్

మహిళల రెజ్లింగ్

3

రాణి రాంపాల్

మహిళల హాకీ

4

మనికబత్రా

మహిళల టేబుల్ టెన్నిస్

5

మరియప్పన్ తంగవేలు

పారా అథ్లెటిక్స్

అర్జున అవార్డు (27):
2020 ఏడాదికి మొత్తం 27 మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

సాత్విక్ సాయిరాజ్

బ్యాడ్మింటన్

2

చిరాగ్ శెట్టి

బ్యాడ్మింటన్

3

ఇషాంత్ శర్మ

క్రికెట్

4

దీప్తి శర్మ

క్రికెట్

5

మనీశ్ కౌశిక్

బాక్సింగ్

6

లవ్లీనా బొర్గోహైన్

బాక్సింగ్

7

మను భాకర్

షూటింగ్

8

సౌరభ్ చౌధరీ

షూటింగ్

9

దివ్య కాక్రన్

రెజ్లింగ్

10

రాహుల్ అవారే

రెజ్లింగ్

11

ఆకాశ్‌దీప్ సింగ్

హాకీ

12

దీపిక

హాకీ

13

దివిజ్ శరణ్

టెన్నిస్

14

అతాను దాస్

ఆర్చరీ

15

ద్యుతీ చంద్

అథ్లెటిక్స్

16

విశేష్ భృగువంశీ

బాస్కెట్‌బాల్

17

అజయ్ అనంత్ సావంత్

ఈక్వేస్టియ్రన్

18

సందేశ్ జింగాన్

ఫుట్‌బాల్

19

అదితి అశోక్

గోల్ఫ్

20

దీపక్ హుడా

కబడ్డీ

21

సారిక కాలే

ఖో-ఖో

22

దత్తు బబన్ భొఖనాల్

రోయింగ్

23

మధురిక పాట్కర్

టేబుల్ టెన్నిస్

24

శివ కేశవన్

వింటర్ స్పోర్ట్స్

25

సుయశ్ నారాయణ్ జాదవ్పారా

స్విమ్మింగ్

26

సందీప్

పారా అథ్లెటిక్స్

27

మనీశ్ నర్వాల్

పారా షూటింగ్

ద్రోణాచార్య అవార్డు (లైఫ్ టైమ్ కేటగిరీ-8):

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

ధర్మేంద్ర తివారీ

ఆర్చరీ

2

పురుషోత్తమ్ రాయ్

అథ్లెటిక్స్

3

శివ్ సింగ్

బాక్సింగ్

4

రమేశ్ పథానియా

హాకీ

5

కృషన్ కుమార్ హుడా

కబడ్డీ

6

విజయ్ బాలచంద్ర మునీశ్వర్

పవర్‌లిఫ్టింగ్

7

నరేశ్ కుమార్

టెన్నిస్

8

ఓంప్రకాశ్ దహియా

రెజ్లింగ్

ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ కేటగిరీ-5):

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

జూడ్ ఫెలిక్స్

సెబాస్టియన్ హాకీ

2

జస్పాల్ రాణా

షూటింగ్

3

కుల్‌దీప్ కుమార్ హండూ

ఉషు

4

యోగేశ్ మాలవియా

మల్లఖంబ్

5

గౌరవ్ ఖన్నా

పారా బ్యాడ్మింటన్

ద్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్) అవార్డు (15):
గతంలో ‘ధ్యాన్ చంద్’ అవార్డును ఒకేసారి అత్యధికంగా ఐదుగురికి ఇచ్చారు.

సంఖ్య

పేరు

క్రీడాంశం

1

నగిశెట్టి ఉష

బాక్సింగ్

2

లఖా సింగ్

బాక్సింగ్

3

కుల్‌దీప్ సింగ్ భుల్లర్

అథ్లెటిక్స్

4

జిన్సీ ఫిలిప్స్

అథ్లెటిక్స్

5

ప్రదీప్ శ్రీకృష్ణ గాంధే

బ్యాడ్మింటన్

6

తృప్తి ముర్గుండే

బ్యాడ్మింటన్

7

అజిత్ సింగ్

హాకీ

8

మన్ ప్రీత్ సింగ్

కబడ్డీ

9

మంజీత్ సింగ్

రోయింగ్

10

సచిన్ నాగ్

స్విమ్మింగ్

11

నందన్ బాల్

టెన్నిస్

12

నేత్రపాల్ హుడా

రెజ్లింగ్

13

సుఖ్వీందర్ సింగ్ సంధూ

ఫుట్‌బాల్

14

రంజిత్ కుమార్

పారా అథ్లెటిక్స్

15

సత్యప్రకాశ్ తివారీ

పారా బ్యాడ్మింటన్

టెన్సింగ్ నార్కే జాతీయ అడ్వెంచర్ అవార్డులు-2019

సంఖ్య

పేరు

విభాగం

1

అనితా దేవి

ల్యాండ్ అడ్వెంచర్

2

కల్నల్ సర్ఫ్‌రాజ్ సింగ్

ల్యాండ్ అడ్వెంచర్

3

టాకా తముత్

ల్యాండ్ అడ్వెంచర్

4

నరేందర్ సింగ్

ల్యాండ్ అడ్వెంచర్

5

కెవ ల్ హిరెన్ కక్కా

ల్యాండ్ అడ్వెంచర్

6

సేతేంద్ర సింగ్

వాటర్ అడ్వెంచర్

7

గజానంద్ యాదవ

ఎయిర్ అడ్వెంచర్

8

దివంగత మాగన్ బిస్సా

లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్

మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (క్రీడా ప్రదర్శనలో ఉత్తమ విశ్వవిద్యాలయం): పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్).
రాష్టీయ్ర ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్:

 • ఐడెంటిఫికేషన్ అండ్ నుర్ట్యూరింగ్ ఆఫ్ బడ్డింగ్ అండ్ యంగ్ టాలెంట్: 1. లక్ష్య ఇన్‌స్టిట్యూట్ 2. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్
 • ఎన్‌కరేజ్‌మెంట్ టు స్పోర్ట్స్ థ్రూ కార్పొరేట్ సోషియల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ)
 • ఎంప్లాయిమెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ స్పోర్ట్స్ వెల్ఫేర్ మెజర్స్: ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్
 • స్పోర్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్: ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనెజ్‌మెంట్(ఐఐఎస్‌ఎమ్)

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎనర్జీ లీడర్ అవార్డు
ఇంధన పొదుపు సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు పర్యావరణ హితమైన చర్యలతో ముందుకెళుతున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ పురస్కారాలు లభించాయి. 2020 కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా, గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ ఆధ్వర్యంలో ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ జాతీయ అవార్డుల్లో భాగంగా ‘నేషనల్ ఎనర్జీ లీడర్’అవార్డుతో పాటు ‘ఎక్స్‌లెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్’అవార్డును పొందినట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధన వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో ఎయిర్‌పోర్టు అవార్డులు పొందిందని పేర్కొన్నారు.

ఫాస్టెస్ట్ హ్యూమన్ కేలిక్యులేటర్‌గా పేరొందిన వ్యక్తి?
గణితంలో అత్యంత వేగంగా గణన ప్రక్రియ పూర్తిచేసిన మానవ కంప్యూటర్‌గా హైదరాబాద్‌కు చెందిన నీలకంఠ భాను ప్రకాశ్ పేరొందాడు. 2020, ఆగస్టు 15న లండన్‌లో నిర్వహించిన ‘మైండ్ స్పోర్ట్ ఒలింపియాడ్’లో గణితంలో అసాధారణ తెలివితేటలు చూపి గోల్డ్ మెడల్ సాధించి అత్యంత ఫాస్టెస్ట్ హ్యూమన్ కేలిక్యులేటర్‌గా భాను రికార్డులకెక్కాడు. పోటీలో సుమారు 13 దేశాలకు చెందిన 30 మంది మేధావులు పాల్గొన్నారు. మోతీనగర్‌లో నివాసముంటున్న ఏళ్ల భాను ప్రకాశ్ విశ్వవిఖ్యాత హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ....
గణితంలో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారాలను కనిపెడుతున్న భాను ప్రకాశ్ ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమ్యాటిక్స్ (హానర్స్) చదువుతున్నాడు. భాను గతంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాడు. ఇప్పటివరకు 5 వరల్డ్ రికార్డులు, 50 లిమ్కా వరల్డ్ రికార్‌‌ట్సను సాధించి అందరి మన్ననలు పొందాడు.
 
సెప్టెంబర్ 2020 స్పోర్ట్స్
టెన్నిస్‌కు బ్రయాన్ సోదరులు వీడ్కోలు
అమెరికా టెన్నిస్ ‘ట్విన్ బ్రదర్స్’ బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికారు. తాము టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు, ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఆగస్టు 27న 42 ఏళ్ల బాబ్-మైక్ అధికారికంగా ప్రకటించారు. అచ్చుగుద్దినట్లు ఉండే ఈ అమెరికా కవల జంటలో ఎవరు మైక్ (మైకేల్ కార్ల్ బ్రయాన్), ఎవరు బాబ్ (రాబర్ట్ చార్లెస్ బ్రయాన్) అని తేల్చుకోవడం చాలా కష్టం. కవల పిల్లలైన వీరిలో మైక్... బాబ్ కంటే రెండు నిమిషాలు పెద్దవాడు.
1995లో తొలిసారి...
1995లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో జంటగా బరిలో దిగిన బ్రయాన్ సోదరులు... 2003లో ఫ్రెంచ్ ఓపెన్ విజయంతో తొలిసారి కెరీర్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. అనంతరం జంటగా వీరు 16 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌ను సాధించారు. 2008 ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని చేజిక్కించుకున్నారు.

బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ విజేతగా హామిల్టన్
బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. బెల్జియంలోని స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్‌లో ఆగస్టు 30న జరిగిన రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 44 ల్యాప్‌లను గంటా 24 నిమిషాల 08.761 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ కెరీర్‌లో ఇది 89వ టైటిల్ కావడం విశేషం. మరో రెండు టైటిల్స్ గెలిస్తే అత్యధిక ఎఫ్1 టైటిల్స్ గెలిచిన జర్మనీ దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేస్తాడు. రేసులో మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానాన్ని పొందాడు.

సిన్సినాటి మాస్టర్స్ చాంపియన్‌గా జొకోవిచ్
వెస్టర్న్ అండ్ సదరన్ టెన్నిస్ టోర్నమెంట్(సిన్సినాటి మాస్టర్స్)లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 30న ముగిసిన సిన్సినాటి మాస్టర్స్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 1-6, 6-3, 6-4తో మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై గెలిచి విజేతగా నిలిచాడు. విజేత జొకోవిచ్‌కు 2,85,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్లు), 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ రావ్‌నిచ్‌కు 1,85,015 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 35 లక్షలు), 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఈసారి న్యూయార్క్‌లో...
వాస్తవానికి ప్రతి యేటా సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నీ ఒహాయో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో జరుగుతుంది. ఈసారి కరోనా కారణంగా వేదికను సిన్సినాటి నుంచి న్యూయార్క్‌కు మార్చారు.
ఏకైక క్రీడాకారుడిగా...
జొకోవిచ్ కెరీర్‌లో ఇది 35వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ కావడం విశేషం. ఈ క్రమంలో అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రాఫెల్ నాదల్ (35 టైటిల్స్-స్పెయిన్) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. అంతేకాకుండా ఈ విజయంతో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్‌లో జరిగే తొమ్మిది వేర్వేరు మాస్టర్స్ సిరీస్ టైటిల్స్‌ను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచి ‘కెరీర్ గోల్డెన్ మాస్టర్స్’ ఘనత సాధించిన ఏకై క క్రీడాకారుడిగా జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు.

హైదరాబాద్ ఎఫ్‌సీ నూతన కోచ్‌గా మార్కెజ్
స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ ‘ల లీగ’ జట్టు ఎఫ్‌సీ బార్సిలోనా కోసం తమ హెడ్ కోచ్ ఆల్బర్ట్ రోకా (స్పెయిన్)ను విడుదల చేసిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ ఎఫ్‌సీ అతడి స్థానంలో స్పెయిన్‌కే చెందిన మాన్యుయెల్ మార్కెజ్‌ను నియమించింది. ఈ మేరకు ఆయనతో ఏడాది కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ జట్టు ఆగస్టు 31న తెలిపింది. డిఫెండర్‌గా కెరీర్ మొదలుపెట్టిన మార్కెజ్... 28 ఏళ్ల వయసులో ఆటకు గుడ్‌బై చెప్పి కోచ్‌గా మారాడు. అనంతరం ‘ల లీగ’లోని లాస్ పాల్‌మస్‌తో పాటు క్రొయేషియాలోని పలు టాప్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు కోచ్‌గా పని చేశాడు.

చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణం
96 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ తొలిసారి స్వర్ణ పతకం సాధించింది. ఆగస్టు 30న ముగిసిన ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్, రష్యా జట్లను సంయుక్త విజేతలుగా అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రకటించింది. రెండు మ్యాచ్‌లతో కూడిన ఫైనల్లో తొలి మ్యాచ్‌లో ఆరు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇరు జట్లూ 3-3తో సమంగా నిలిచాయి. ఇంటర్నెట్ కనెక్షన్ పోయిన కారణంగా రెండో మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా రద్దు చేశారు. తొలి మ్యాచ్ సమంగా ముగియడంతో రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. ప్రస్తుతం ఫిడే అధ్యక్ష పదవిలో అర్కాడీ ద్వోర్‌కోవిచ్ (రష్యా) ఉన్నారు. ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో 2014లో భారత్ కాంస్య సాధించిన విషయం తెలిసిందే.
భారత బృందంలో...
స్వర్ణం గెలిచిన భారత బృందంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ ఉన్నారు. అలాగే ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతి, నిహాల్ సరీన్, అరవింద్ చిదంబరం, ప్రజ్ఞానంద, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, భక్తి కులకర్ణి, వంతిక అగర్వాల్ మిగతా సభ్యులుగా ఉన్నారు.

యూఎస్ ఓపెన్‌లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్?
యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్న ప్లేయర్‌గా (పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలు కలిపి) అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఘనత వహించింది. న్యూయార్క్‌లో సెప్టెంబర్ 2న జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ సెరెనా 7-5, 6-3తో తన దేశానికే చెందిన క్రిస్టీ ఆన్‌పై విజయం సాధించడంతో తాజా రికార్డు నమోదైంది. తాజా గెలుపుతో 101 విజయాలతో అమెరికాకే చెందిన మరో దిగ్గజం క్రిస్ ఎవర్ట్ పేరిట ఇన్నాళ్లూ ఉన్న రికార్డును 102వ విజయంతో సెరెనా బద్దలు కొట్టింది. 1998లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ఆడిన సెరెనా ఆరుసార్లు విజేతగా (1999, 2002, 2008, 2012, 2013, 2014)... నాలుగుసార్లు రన్నరప్‌గా (2001, 2011, 2018, 2019) నిలిచింది.
 
సెప్టెంబర్ 2020 వ్యక్తులు
 
జపాన్ ప్రధాని పదవిని వీడనున్న షింజో అబె
ప్రపంచంలోనే ఆర్థికంగా శక్తిమంతమైన మూడో దేశమైన జపాన్‌ను సుదీర్ఘకాలం పరిపాలించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన షింజో అబె అనారోగ్య కారణాలతో పదవి వీడనున్నారు. ఆగస్టు 31న పదవి నుంచి వైదొలుగుతానని ఆగస్టు 28న షింజో అబె ప్రకటించారు. తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోకుండానే పదవి వీడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యుక్త వయసులో ఉన్నప్పట్నుంచి అల్సరేటివ్ కాలిట్స్ అనే పెద్ద పేగుకి సంబంధించిన సమస్యతో అబె బాధపడుతున్నారు.
2006లో తొలిసారిగా జపాన్‌కు ప్రధాని అయిన 65 ఏళ్ల అబె అనారోగ్య సమస్యలతో ఏడాదికే రాజీనామా చేశారు. తిరిగి 2012లో అధికారంలోకి వచ్చిన ఆయన తన ఆర్థిక విధానాలతో గుర్తింపు పొందారు. 2021 ఏడాది సెప్టెంబర్‌తో ఆయన పదవీకాలం ముగిసిపోతుంది.


హాలీవుడ్ హీరో చద్విక్ బోస్‌మ్యాన్ కన్నుమూత
మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ హీరో చద్విక్ బోస్‌మ్యాన్(43) కన్నుమూశారు. కొంతకాలంగా పేగు సంబంధిత క్యాన్సర్‌తో ఆయన లాస్‌ఏంజెల్స్‌లో ఆగస్టు 28న తుదిశాస విడిచారు. 2016లో ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. 2003లో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన చద్విక్ ‘ది కిల్ హోల్, డ్రాఫ్ట్ డే, గెట్ ఆన్ అప్, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్’ వంటి సినిమాలు చేశారు. క్యాన్సర్ చికిత్స, కీమోథెరపీలను తీసుకుంటూనే ‘బ్లాక్ పాంథర్, మార్షల్, దా 5 బ్లడ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించారాయన.


పీటీఐ చైర్మన్‌గా అవీక్ సర్కార్ ఎన్నిక
ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) చైర్మన్‌గా ఆనంద్ బజార్ గ్రూప్ పబ్లికేషన్స్ ఎడిటర్ ఎమిరిటస్, వైస్ చైర్మన్ అవీక్ సర్కార్(75) ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పీటీఐ బోర్డు ఆగస్టు 29న ధ్రువీకరించింది. పంజాబ్ కేసరి గ్రూప్ చీఫ్ ఎడిటర్ విజయ్‌కుమార్ చోప్రా స్థానంలో అవీక్ సర్కార్ బాధ్యతలు చేపట్టనున్నారు. సర్కార్.. టెలిగ్రాఫ్, ఆనంద్ బజార్ పత్రిక డైలీలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ గ్రూప్ కింద ఆరు టీవీ చానళ్లు, అనేక మేగజీన్లు ఉన్నాయి. పెంగ్విన్ ఇండియాకు ఫౌండింగ్ ఎండీగా, బిజినెస్‌స్టాండర్డ్‌కు ఫౌండింగ్ ఎడిటర్‌గానూ వ్యవహరించారు.

న్యాయవాది ప్రశాంత్‌కు రూపాయి జరిమానా
న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన నేరానికిగాను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు ఒక రూపాయి జరిమానా విధించింది. 2020, సెప్టెంబర్ 15లోగా ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టులో జమచేయాలని, లేని పక్షంలో 3 నెలల జైలు, న్యాయవాద వృత్తి నుంచి మూడేళ్ల నిషేధం అనుభవించాల్సి ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన బెంచ్ ఆగసు 31న తీర్పునిచ్చింది. న్యాయాన్ని అందించే వ్యవస్థ గౌరవాన్ని ప్రశాంత్ భూషణ్ తన ట్వీట్లతో తగ్గించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కోవాక్సిన్ రెండో దశ ట్రయల్స్...
దేశీయంగా తయారు చేస్తున్న కరోనా టీకా ‘కోవాక్సిన్’త్వరలోనే రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో అడుగుపెట్టనుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐఎంఎస్) వెల్లడించింది. కరోనా నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన ‘కోవాక్సిన్’ను మనుషులపై ప్రయోగించేందుకు ఐసీఎంఆర్ అనుమతిచ్చిన 12 మెడికల్ కాలేజీల్లో ఐఎంఎస్ కూడా ఉంది.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు
రాజకీయ దురంధరుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) ఇకలేరు. అనారోగ్యంతో గత 21 రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుతో ఆగస్టు 31న తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అదే హాస్పిటల్‌లో ఆగస్టు 10న ప్రణబ్‌కు వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. అదే సమయంలో, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో పాటు కరోనా కూడా సోకడంతో అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పైనే కోమాలో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలను సెప్టెంబర్ 1న ఢిల్లీలో లోధిరోడ్‌లోని శ్మశాన వాటికలో నిర్వహించారు.
వారం పాటు సంతాపం..
ప్రణబ్‌కు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ప్రణబ్ మృతికి సంతాపసూచకంగా ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో జాతీయ పతాకం సగం వరకు అవనతం చేస్తారని తెలిపింది.
మిరాటి గ్రామంలో జననం...
1935 డిసెంబర్ 11న అప్పటి బ్రిటిష్ ఇండియాలో భాగమైన బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న మిరాటి గ్రామంలో(ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లోని బీర్బుమ్ జిల్లాలో ఉంది) ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి ముఖర్జీ, కమద కింకర్ ముఖర్జీ. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రణబ్ కలకత్తా యూనివర్సిటీలో ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతి శాస్త్రం), ఎల్‌ఎల్‌బీ చదివారు. మొదట డిప్యూటీ అకౌంటెంట్ జనరల్(పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్) కార్యాలయంలో యూడీసీగా ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత కలకత్తాలోని విద్యాసాగర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు జర్నలిస్ట్‌గా కొంతకాలం పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం...
 
 • 1969లో క్రియాశీల రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ప్రణబ్ 1969 జూలైలోనే కాగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్లారు. ఆ తరువాత 1975, 1981, 1993, 1999ల్లోనూ ఎగువ సభకు ఎన్నికై , పలుమార్లు సభా నాయకుడిగా సేవలందించారు.
 • 1973లో తొలిసారి కేంద్రంలో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత వివిధ శాఖలు నిర్వహించి, 1982లో కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు.
 • 1978లోనే సీడబ్ల్యూసీ సభ్యుడైన ప్రణబ్... ఇందిరాగాంధీ కేబినెట్లో నంబర్ 2గా ప్రఖ్యాతి గాంచారు.
 • 1986లో సొంతంగా రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ అనే ఒక రాజకీయ పార్టీని ప్రణబ్ స్థాపించారు. 1989లో ఆ పార్టీని ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
 • 1982లో ఆయన 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అయ్యారు. దేశ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య శాఖలను చూశారు. ఇన్ని కీలకశాఖలను చూసిన తొలి రాష్ట్రపతి ప్రణబే. ముగ్గురు ప్రధానమంత్రులు... ఇంధిరాగాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌ల వద్ద పనిచేసిన అరుదైన గుర్తింపు పొందారు.
 • ప్రధానమంత్రిగా పనిచేయకుండా... లోక్‌సభ నాయకుడిగా 8 ఏళ్లు పనిచేసిన ఏకైక నేత.
 • ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగానూ పనిచేసిన ప్రణబ్ 1980-85 ఏళ్లలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్నారు.
 • 2004-2012 మధ్యకాలంలో మొత్తం 39 మంత్రివర్గ ఉపసంఘాలు (గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్) ఉండగా... వీటిలో ఏకంగా ఇరవై నాలుగింటికి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వం వహించారు.
 • ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ప్రణబ్ దేశ అభివృద్ధిపథంలో కీలకపాత్ర పోషించారు.
 • 2005లో ప్రణబ్ రక్షణమంత్రిగా ఉన్నపుడే భారత్- అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.
 • 1977లో మాల్దా నుంచి, 1980లో బోల్‌పూర్ నుంచి లోక్‌సభకు పోటీచేసిన ప్రణబ్ దా ఓటమిపాలయ్యారు. తర్వాత 2004లో జంగిపూర్ (ముర్షిదాబాద్) నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.
 • 2012, జూలై 25 నుంచి 2017, జూలై 25 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ దా బాధ్యతలు నిర్వర్తించారు.

భారతరత్న గ్రహీత...

 • ప్రణబ్ దా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులుగా ఉన్నారు.
 • దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్నతో పాటు, పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా అవార్డులు ఆయన్ను వరించాయి.
 • ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనకు ఐదు గౌరవ డాక్టరేట్స్‌ను ప్రదానం చేశాయి.
 • 2020, డిసెంబరు 11వ తేదీన ప్రణబ్ జయంతిని పురస్కరించుకొని ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పుస్తకాన్ని విడుదల చేస్తామని ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్ వెల్లడించింది. ఇది ప్రణబ్ రాసిన నాలుగో పుస్తకం. ఇంతకుముందు ఆయన... ‘ది డ్రమటిక్ డికేడ్ (2014), ది టర్బులెంట్ ఇయర్స్ (2016), ది కొయలిషన్ ఇయర్స్ (2017)లను రాశారు.
 • రాష్ట్రపతిగా తన పదవీకాలంలో ఆఖరి రెండేళ్లు రాష్ట్రపతి భవన్‌ను ఒక పాఠశాలగా మార్చి తాను స్వయంగా టీచర్ అవతారం ఎత్తారు. రాష్ట్రపతి ఎస్టేట్‌లోని రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయాలో 11, 12 తరగతి విద్యార్థులకు ప్రణబ్ దా పాఠాలు చెప్పారు.
 • క్షమాభిక్ష పిటిషన్ల విషయంలో రాష్ట్రపతిగా ప్రణబ్ చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు. అయిదేళ్ల పదవీ కాలంలో నలుగురికి క్షమాభిక్ష ప్రసాదిస్తే, 30 పిటిషన్లను తిరస్కరించారు.
 • రాజకీయ దురంధరుడిగా, అపర చాణక్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, నడిచే విజ్ఞాన సర్వస్వంగా దేశ ప్రజలు, సహచరుల మన్ననలు ప్రణబ్ దా పొందారు.
 • సొంతూరి(మిరాటి గ్రామం)తో ఉన్న అనుబంధాన్ని మాత్రం ప్రణబ్ ఎన్నడూ మరువలేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఏటా దుర్గాపూజ సమయంలో మాత్రం సొంతూళ్లోనే ఉండేవారు.


కొత్త ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వ్యక్తి?
భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ సెప్టెంబర్ 1న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా చేరిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ నియమితులయ్యారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి(జార్ఖండ్ క్యాడర్) అయిన రాజీవ్ కుమార్ ఐదేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగి, 2025లో రిటైర్ అవుతారు. 2024 సార్వత్రిక ఎన్నికలు ఈయన నేతృత్వంలో జరగనున్నాయి. నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషనర్ ఆరేళ్లు పదవిలో ఉండాల్సి ఉండగా, 2025 ఫిబ్రవరిలో 65 ఏళ్లు నిండడంతో ఈయన ఒక ఏడాది ముందుగానే రిటైర్ కానున్నారు.

హిందుస్థాన్ షిప్‌యార్డ్ సీఎండీగా నియమితులైన వారు?
హిందుస్థాన్ షిప్‌యార్డ్ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా నేవీ విశ్రాంత అధికారి కమొడోర్ హేమంత్ ఖత్రి సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. రియర్ అడ్మిరల్ ఎల్.వి.శరత్‌బాబు స్థానంలో ఖత్రి నియామకం జరిగింది. ఖత్రి షిప్‌యార్డ్‌లో 2017 నుంచి డెరైక్టర్ (స్ట్రాటజిక్ ప్రాజెక్ట్)గా పనిచేశారు. డెరైక్టర్‌గా ఉన్న సమయంలో సంస్థలో మరమ్మతుల కోసం వచ్చిన ఐఎన్‌ఎస్ సింధూవీర్, ఐఎన్‌ఎస్ అస్త్రధరణి సబ్‌మెరైన్‌లను నిర్ణీత సమయం కంటే ముందే అందించారు. ఐఎన్‌ఎస్ దీపక్, ఐఎన్‌ఎస్ శక్తి, నేవల్ ఫీట్ ట్యాంకర్స్ వంటి నౌకలతో పాటు యూరోపియన్ షిప్‌యార్డ్‌లో నౌకల తయారీలో ఖత్రికి అనుభవం ఉంది. హిందుస్థాన్ షిప్‌యార్డ్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది.

ఫార్చూన్ 40:40 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులు?
ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలురైన ప్రముఖుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వారసులు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ చోటు దక్కించుకున్నారు. అలాగే ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్, షావోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్‌లకు కూడా స్థానం లభించింది. 40 ఏళ్ల లోపు వయస్సున్న 40 మంది ప్రముఖులతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది.
టెక్నాలజీ కేటగిరీలో...
2020 ఏడాది ఆర్థికం, సాంకేతికత, వైద్యం, ప్రభుత్వం.. రాజకీయాలు, మీడియా.. వినోదరంగం అనే అయిదు కేటగిరీల నుంచి ఫార్చూన్ ప్రముఖులను ఎంపిక చేసింది. టెక్నాలజీ కేటగిరీలో ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీ, బైజు రవీంద్రన్, షావోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ చోటు దక్కించుకున్నారు.
రిలయన్స్ కు తోడ్పాటు...
బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్ డిగ్రీ పొందిన తర్వాత 2014లో ఆకాశ్ కుటుంబ వ్యాపారమైన రిలయన్స్ లో చేరారు. యేల్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన ఈషా ఆ మరుసటి ఏడాది కంపెనీలో చేరారు. రిలయన్స్ లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ వంటి దిగ్గజాలు భారీగా ఇన్వెస్ట్ చేయడంలో జియో బోర్డు సభ్యులుగా వీరు తోడ్పాటు అందించినట్లు ఫార్చూన్ పేర్కొంది.
ఆన్‌లైన్ విద్య సాధ్యమేనని...
భారీ స్థాయిలో ఆన్‌లైన్ విద్యా సంస్థను నెలకొల్పడం సాధ్యమేనని రవీంద్రన్ నిరూపించారని ఫార్చూన్ పేర్కొంది. అటు స్టార్టప్స్ ఏర్పాటు చేసిన అనుభవం తప్ప స్మార్ట్‌ఫోన్స్ గురించి అంతగా తెలియని మను జైన్ .. చైనా కంపెనీ షావోమీ భారత్‌లో కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు తోడ్పడ్డారని తెలిపింది.